వార్త ముఖ్యాంశాలు
- కడప జిల్లా నందలూరు మండలం చెయ్యేరు అక్రమ ఇసుక తరలింపు..
- టిప్పర్, హిటాచీ సీజ్ కడప జిల్లా నందలూరు మండలం చెయ్యేరు ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్తో పాటు హిటాచీని రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు.
- కుమ్మరిపల్లె గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నట్లు స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.
కడప జిల్లా నందలూరు మండలం చెయ్యేరు అక్రమ ఇసుక తరలింపు.. టిప్పర్, హిటాచీ సీజ్
కడప జిల్లా నందలూరు మండలం చెయ్యేరు ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్తో పాటు హిటాచీని రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు. కుమ్మరిపల్లె గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నట్లు స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అధికారులు టిప్పర్, హిటాచీని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.