Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

చిట్వేల్ : బొప్పాయి కూలీలకు పోలీసుల రోడ్డు భద్రతా అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చిట్వేల్ : బొప్పాయి కూలీలకు పోలీసుల రోడ్డు భద్రతా అవగాహన

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్, సెప్టెంబర్ 2: తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం , చిట్వేల్–రాపూర్ క్రాస్‌రోడ్డులో బొప్పాయి కూలీలకు పోలీసులు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
  • తిరుపతి జిల్లా, రేణిగుంట డీఎస్పీ వై.
  • శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చిట్వేల్ ఎస్సై వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుళ్లు నరసింహులు, నాగేశ్వరరావు కార్యక్రమం నిర్వహించారు.

చిట్వేల్, సెప్టెంబర్ 2: తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం , చిట్వేల్–రాపూర్ క్రాస్‌రోడ్డులో బొప్పాయి కూలీలకు పోలీసులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లా, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చిట్వేల్ ఎస్సై వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుళ్లు నరసింహులు, నాగేశ్వరరావు కార్యక్రమం నిర్వహించారు. కూలీలు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని సూచించారు. సైబర్ క్రైమ్, బాల్యవివాహాలు, మైనర్లు వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు. అలాగే పికప్ వ్యాన్లపై కూర్చొని ప్రయాణించడం ప్రమాదకరమని, వాహనం టాప్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోవద్దని కూలీలకు సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *