Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

ఘనంగా ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు.

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి: హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో, ప్రశాంత్ నగర్, ఉప్పల్ బ్యాంకు కాలనీ కమ్యూనిటీ హాల్ లో విజయదశమి ఉత్సవ సందర్బంగా ఫలుక్నామా జూనియర్ కాలేజి లెక్చరర్ బెల్లంకొండ అరుంధతి అతిథిగా హాజరై ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
  • వారు మాట్లాడుతూ ఆర్ ఎస్ ఎస్ దేశ సేవలను కొనియాడారు.
  • ముఖ్య వక్త లింగంపల్లి వీరన్న గారు ఆర్ ఎస్ ఎస్ శాఖ విశిష్టత వివరించి నేటి యువత ఆర్ ఎస్ ఎస్ శాఖకు నిత్యం రావాలని అందువల్ల వారి వ్యక్తిత్వ వికాసం మరియు దేశ వికాసం అవుతుంది అని అన్నారు.

పున్నమి: హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో, ప్రశాంత్ నగర్, ఉప్పల్ బ్యాంకు కాలనీ కమ్యూనిటీ హాల్ లో విజయదశమి ఉత్సవ సందర్బంగా ఫలుక్నామా జూనియర్ కాలేజి లెక్చరర్ బెల్లంకొండ అరుంధతి అతిథిగా హాజరై ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆర్ ఎస్ ఎస్ దేశ సేవలను కొనియాడారు. ముఖ్య వక్త లింగంపల్లి వీరన్న గారు ఆర్ ఎస్ ఎస్ శాఖ విశిష్టత వివరించి నేటి యువత ఆర్ ఎస్ ఎస్ శాఖకు నిత్యం రావాలని అందువల్ల వారి వ్యక్తిత్వ వికాసం మరియు దేశ వికాసం అవుతుంది అని అన్నారు. ఆర్ ఎస్ ఎస్ శతాబ్ది కార్యక్రమంలో భాగంగా సమాజంలో పంచ పరివర్తన్ తిసుకురావడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరమపూజనీయ డా॥ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని 1925లో విజయదశమి పర్వదినాన స్థాపించారు. సమరసతతో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణంలో నిమగ్నమైన సంఘం, ఈ విజయ దశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొంది. యువత ప్రతి ఒక్కరూ స్ఫూర్తి దాయకంగా పయనించాలని సూచించారు. ఈ శుభతరుణంలో ఏర్పాటు చేసిన విజయదశమి ఉత్సవానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *