Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

గుండాల గ్రామంలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక సమ్మిళిత సంతృప్తి శిబిరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గుండాల గ్రామంలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక సమ్మిళిత సంతృప్తి శిబిరం

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ అక్టోబర్ 21 ( పున్నమి ప్రతినిధి) ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుండాల గ్రామంలో సర్పంచ్ చంద్రకాంత్ అధ్యక్షతన ఎస్‌బీఐ ఆధ్వర్యంలో సచ్యూరేషన్ క్యాంపెయిన్ నిర్వహించారు.
  • ముఖ్య అతిథులుగా బ్రాంచ్ మేనేజర్ రవి, ఎఫ్‌ఐ మేనేజర్ పుల్లయ్య, ఎల్‌బీఓ అధికారి పాపయ్య పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రజలకు బీమా, పెన్షన్ పథకాల ప్రయోజనాలు అందించడం, బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.

నిర్మల్ అక్టోబర్ 21 ( పున్నమి ప్రతినిధి)
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుండాల గ్రామంలో సర్పంచ్ చంద్రకాంత్ అధ్యక్షతన ఎస్‌బీఐ ఆధ్వర్యంలో సచ్యూరేషన్ క్యాంపెయిన్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బ్రాంచ్ మేనేజర్ రవి, ఎఫ్‌ఐ మేనేజర్ పుల్లయ్య, ఎల్‌బీఓ అధికారి పాపయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రజలకు బీమా, పెన్షన్ పథకాల ప్రయోజనాలు అందించడం, బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ ప్రచారం కొనసాగుతుందని తెలిపారు. జన్ ధన్ ఖాతాలు, ఆధార్ అనుసంధానం, రీ-కేవైసీ, కిసాన్ క్రెడిట్ కార్డులు, డిజిటల్ చెల్లింపులు, సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గంగాధర్, కమలాకర్, కృష్ణ, అనిల్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *