వార్త ముఖ్యాంశాలు
- బైంసా: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ సూచించారు.
- మంగళవారం ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని పురస్కరించుకొని బైంసాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.
- ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలవడంలో అంబేద్కర్ కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
బైంసా: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ సూచించారు. మంగళవారం ధర్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని పురస్కరించుకొని బైంసాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలవడంలో అంబేద్కర్ కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదరికంలో జన్మించినప్పటికీ ఎన్నో కష్టాలను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించి, తన ప్రతిభతో దేశానికి విశేష సేవలందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. యువత అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తన జీవితంతో నిరూపించిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు.