అక్టోబర్ 20 పున్నమి ప్రతినిద్ నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో నిర్వహించిన విజయదశమి (దసరా) వేడుకల్లో ఖానాపూర్ శాసనసభ్యులు, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులు, ఖానాపూర్ ప్రాంత ప్రజలతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని, ఐక్యతా భావాన్ని నింపాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎల్ ఈనో ప్రభావం వల్ల కలిగే వాతావరణ మార్పులు, వ్యవసాయంపై వాటి ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు, ఖానాపూర్ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
ప్రజలతో మమేకమవుతూ.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజానాయకుడు — వెడ్మ బొజ్జు పటేల్!
