Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గిడుగు వెంకట రామమూర్తి స్ఫూర్తితో తెలుగు భాషా దినోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గిడుగు వెంకట రామమూర్తి స్ఫూర్తితో తెలుగు భాషా దినోత్సవం

గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని నెల్లూరులోని జి.వి.ఆర్.ఆర్ జూనియర్ కళాశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.బి. రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులు డాక్టర్ కె.వి. సత్యనారాయణ, డాక్టర్ మర్రి వెంకట్రావు మాట్లాడుతూ వ్యావహారిక తెలుగు భాష అభివృద్ధికి గిడుగు చేసిన సేవలను వివరించారు. విద్యార్థులు మాతృభాషపై పట్టు సాధించి, తెలుగు కవులు, రచయితల సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. తెలుగు మాట్లాడటం గౌరవమని, చదవడం బాధ్యతని, భాషను కాపాడటం అందరి కర్తవ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

గిడుగు వెంకట రామమూర్తి స్ఫూర్తితో తెలుగు భాషా దినోత్సవం

గిడుగు వెంకట రామమూర్తి స్ఫూర్తితో తెలుగు భాషా దినోత్సవం

గిడుగు వెంకట రామమూర్తి స్ఫూర్తితో తెలుగు భాషా దినోత్సవం

గిడుగు వెంకట రామమూర్తి స్ఫూర్తితో తెలుగు భాషా దినోత్సవం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *