Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎస్.కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎస్.కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం

గూడూరు ఆగస్టు 29:
గూడూరు పట్టణం నందు గల ఎస్. కె. ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ అధ్యక్షత వహించి తెలుగు భాషకు వెలుగునిచ్చిన స్వర్గీయ శ్రీ గిడుగు రామమూర్తి పంతులుకు అధ్యాపకులతో కలసి ఘన నివాళులు అర్పించి విద్యార్థులు తమ మాతృ భాషలో విద్యను అభ్యసించడం చాలా సులభమని, విద్యార్థులకు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. అనంతరం గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా కళాశాల విద్యార్థులకు పలు రకాలైన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులైన తెలుగు అధ్యాపకుడు డాక్టర్ ఎం. రాజేశ్ బాబు, కళాశాల సీనియర్ అధ్యాపకులు డాక్టర్ కె. లావణ్య, కృప కరుణ వాణి, శ్రీమతి మైమూన్, డాక్టర్ విజయ మహేష్, డాక్టర్ వెంకట ప్రసాద్, రమణా రెడ్డి, ఆంగ్ల అధ్యాపకురాలు శ్రీమతి వసంత మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్.కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *