వార్త ముఖ్యాంశాలు
- యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డు కొక్కిరాపల్లి గ్రామంలో గ్రామ పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గ్రామ జ్యోతి యువత ఆదర్శంగా నిలుస్తున్నారు.
- ప్రతి ఆదివారం ఉదయం రెండు గంటల పాటు శ్రమదానం నిర్వహిస్తూ గ్రామాభివృద్ధిలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో గ్రామ ప్రధాన రహదారిపై సీతా రాజు ఇంటి నుంచి ఆర్.కె.
- లేఔట్ వరకు రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ రహదారులు పరిశుభ్రంగా ఉంటే విషపురుగులు, ప్రమాదకర జీవుల సంచారాన్ని అరికట్టవచ్చని, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమి కలుషితం కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు.
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డు కొక్కిరాపల్లి గ్రామంలో గ్రామ పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గ్రామ జ్యోతి యువత ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఆదివారం ఉదయం రెండు గంటల పాటు శ్రమదానం నిర్వహిస్తూ గ్రామాభివృద్ధిలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో గ్రామ ప్రధాన రహదారిపై సీతా రాజు ఇంటి నుంచి ఆర్.కె. లేఔట్ వరకు రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ రహదారులు పరిశుభ్రంగా ఉంటే విషపురుగులు, ప్రమాదకర జీవుల సంచారాన్ని అరికట్టవచ్చని, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమి కలుషితం కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఒక్కరి బాధ్యత కాదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించి శ్రమదాన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ జ్యోతి యువత సభ్యులు దేవి ప్రసాద్, నాగేష్, లక్ష్మి, శ్రావణి, ధరిణి, ఓంకార్, యశ్వంత్, యువరాజ్, జయరాజ్, గోపేష్తో పాటు పలువురు చిన్నారులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- కె. ఆనంద్పత్రిక / వెబ్సైట్