వింజమూరు మండల కేంద్రంలోని గంగమిట్ట, బీసీ కాలనీ, అరుంధతివాడ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు సీలింగ్ ఫ్యాన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ, మాజీ ఎంపీపీ వనిపెంట హైమావతి, మహిళా ప్రధాన కార్యదర్శి రేబాల రూపకల చేతుల మీదుగా వీటిని అందజేశారు. చిన్నారులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్లు ప్రవీణ తెలిపారు. గంగమిట్ట అంగన్వాడీలో 20 రోజులుగా ఉన్న విద్యుత్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్యం, విద్య, భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు. సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, స్థానిక నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
