Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవో పావని

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరులో నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవో పావని

వార్త ముఖ్యాంశాలు

  • నిబంధనల మేరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టాలని సిబ్బందికి సూచన ఆత్మకూరు, నవంబరు 18 (పున్నమి): నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఆర్డీవో బి.
  • పావని కేంద్రాలను పర్యవేక్షించారు.
  • ఇందులో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణలో ప్రభుత్వ నిబంధనలు, ఎన్నికల శిక్షణలో సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.

నిబంధనల మేరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టాలని సిబ్బందికి సూచన

ఆత్మకూరు, నవంబరు 18 (పున్నమి):

నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఆర్డీవో బి. పావని కేంద్రాలను పర్యవేక్షించారు. ఇందులో భాగంగా ఆత్మకూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణలో ప్రభుత్వ నిబంధనలు, ఎన్నికల శిక్షణలో సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ఎలాంటి పొరపాట్లు, వివాదాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు.అలాగే డివిజన్ పరిధిలోని మిగిలిన మండలాల్లో నామినేషన్ల స్వీకరణ జరుగుతున్న తీరును స్థానిక అధికారులతో ఫోన్ ద్వారా సమీక్షించి, అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *