వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరులో భూముల రీ-సర్వే పనులపై ఆర్డీవో క్షేత్రస్థాయి పరిశీలన ఆత్మకూరు, నవంబరు 18 (పున్నమి): నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ పరిధిలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను ఆత్మకూరు ఆర్డీవో బి.
- పావని బుధవారం క్షేత్రస్థాయిలో,పరిశీలించారు.
- పొలాల వద్ద సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ సిబ్బంది పనితీరును సమీక్షించి, సర్వే పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.రీ-సర్వే వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, భూముల వివరాల నమోదు ద్వారా చేకూరే లబ్ధిని రైతులకు వివరించారు.
ఆత్మకూరులో భూముల రీ-సర్వే పనులపై ఆర్డీవో క్షేత్రస్థాయి పరిశీలన
ఆత్మకూరు, నవంబరు 18 (పున్నమి): నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ పరిధిలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను ఆత్మకూరు ఆర్డీవో బి. పావని బుధవారం క్షేత్రస్థాయిలో,పరిశీలించారు. పొలాల వద్ద సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ సిబ్బంది పనితీరును సమీక్షించి, సర్వే పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.రీ-సర్వే వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, భూముల వివరాల నమోదు ద్వారా చేకూరే లబ్ధిని రైతులకు వివరించారు. సర్వే సమయంలో ఏవైనా సమస్యలు లేదా అభ్యంతరాలు ఎదురైతే సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.