Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేదలకు వరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేదలకు వరం

వార్త ముఖ్యాంశాలు

  • కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు వరమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.
  • గురువారం భైంసాలోని బృందావన్ గార్డెన్స్‌లో 121 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
  • ఇందులో 69 మందికి కల్యాణ లక్ష్మి, 52 మందికి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు వరమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. గురువారం భైంసాలోని బృందావన్ గార్డెన్స్‌లో 121 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో 69 మందికి కల్యాణ లక్ష్మి, 52 మందికి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఎన్నికల హామీ మేరకు తులం బంగారం ఇవ్వలేకపోతే, పథకం కింద అందించే ఆర్థిక సాయాన్ని రూ.1.50 లక్షలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. భైంసా పట్టణం, మండలంలో మరో 244 మంది దరఖాస్తు చేసుకోగా, త్వరలో అర్హులకు చెక్కులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మోళ్ల దత్తాత్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *