Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

కరాటేలో ఎలమంచిలి విద్యార్థుల సత్తా.. 16 స్వర్ణాలు, 7 రజతాలు, కాంస్యం కైవసం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కరాటేలో ఎలమంచిలి విద్యార్థుల సత్తా.. 16 స్వర్ణాలు, 7 రజతాలు, కాంస్యం కైవసం

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ : యలమంచిలి అమలాపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం పవన్ కిక్ ఫోటో కాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో ఇంటర్ స్టేట్ ఇన్విటేషన్ లెవల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 ఘనంగా జరిగింది.
  • ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి వెయ్యి మందికి పైగా విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.
  • ఎలమంచిలికి చెందిన ఎన్‌వీఆర్ సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ నుంచి 20 మంది విద్యార్థులు హాజరై తమ ప్రతిభను చాటారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ : యలమంచిలి

అమలాపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం పవన్ కిక్ ఫోటో కాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో ఇంటర్ స్టేట్ ఇన్విటేషన్ లెవల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి వెయ్యి మందికి పైగా విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఎలమంచిలికి చెందిన ఎన్‌వీఆర్ సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ నుంచి 20 మంది విద్యార్థులు హాజరై తమ ప్రతిభను చాటారు. కాటా, ఫైటింగ్ విభాగాల్లో హోరాహోరీగా తలపడిన విద్యార్థులు 16 స్వర్ణ పతకాలు, 7 రజత పతకాలు, 1 కాంస్య పతకం సాధించారు.
పోటీల్లో కే. హైతి, పి.బి.ఎస్. వర్షిణి, ఎ. ధనుష్, వి. హేతాన్ శ్రీ, ఎస్. లీలా లోహిత్, కే. చేతన్, పి. కుశాల్, కే. రోహిత్ కుమార్, బి. జ్యోతిష్, టీ.బి.ఎస్. జోశ్రీత్, బి. వైష్ణవి, కే. హ్యాన్స్ తదితరులు ప్రతిభ కనబరిచారు. భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడంతో ఛాంపియన్‌షిప్ క్రీడా సందడితో కళకళలాడింది. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలని, కరాటే ద్వారా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందడంతో పాటు ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని , 6వ డాన్ బ్లాక్ బెల్ట్ నక్కా వెంకట్రామన్ రంగా తెలిపారు. చీప్ కోచ్ బ్లాక్ బెల్ట్ కే. శ్రీను విద్యార్థులకు శిక్షణ అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *