వార్త ముఖ్యాంశాలు
- ఎస్.రాయవరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ అంధత్వం, దృష్టిలోపం నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
- సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కె.
- లక్ష్మి ఆధ్వర్యంలో మొత్తం 73 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టారు.
ఎస్.రాయవరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం జాతీయ అంధత్వం, దృష్టిలోపం నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కె. లక్ష్మి ఆధ్వర్యంలో మొత్తం 73 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టారు. వీరిలో దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన 20 మంది విద్యార్థులకు కళ్లద్దాలు వినియోగించాలని వైద్య సిబ్బంది సిఫార్సు చేశారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే కంటి ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటం, దృష్టి సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీసం ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వాసంతి పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- కె. ఆనంద్పత్రిక / వెబ్సైట్