Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఎస్‌సీ యువతకు నైపుణ్య బాట.. ఉపాధి అవకాశాలపై అవగాహన!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎస్‌సీ యువతకు నైపుణ్య బాట.. ఉపాధి అవకాశాలపై అవగాహన!

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు) ఎస్‌సీ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఎస్‌సీ యువతకు వివిధ ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
  • కేంద్ర ప్రభుత్వ పథకాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, నర్సింగ్ కోర్సులు, అమరాజా బ్యాటరీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలతో పాటు డ్రోన్ శిక్షణ, ఉపాధి అవకాశాలపై యువతకు వివరించారు.
  • ఈ కార్యక్రమానికి ఎస్‌సీ యువత ఉత్సాహంగా హాజరై వివిధ అవకాశాలపై అవగాహన పొందారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)

విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు) ఎస్‌సీ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఎస్‌సీ యువతకు వివిధ ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, నర్సింగ్ కోర్సులు, అమరాజా బ్యాటరీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలతో పాటు డ్రోన్ శిక్షణ, ఉపాధి అవకాశాలపై యువతకు వివరించారు.
ఈ కార్యక్రమానికి ఎస్‌సీ యువత ఉత్సాహంగా హాజరై వివిధ అవకాశాలపై అవగాహన పొందారు. యువత తమ విద్యార్హతలు, ఆసక్తులకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని నిర్వాహకులు సూచించారు.
సదస్సుకు హాజరైన ఎస్‌సీ యువతతో పాటు ఎస్‌సీ కార్పొరేషన్ డైరెక్టర్లు, డీవీఎంసీ సభ్యులు, ఇతర ప్రతినిధులకు ఎస్‌సీ కార్పొరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *