Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఎలమంచిలిలో టీడీపీకి భారీ షాక్‌.. కరణం ధర్మశ్రీ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి 150 మంది కార్యకర్తలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎలమంచిలిలో టీడీపీకి భారీ షాక్‌.. కరణం ధర్మశ్రీ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి 150 మంది కార్యకర్తలు!

వార్త ముఖ్యాంశాలు

  • ఎలమంచిలి మున్సిపాలిటీ 16వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన 150 మంది కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
  • సేనాపతి తులసిరావు తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.వైఎస్సార్‌సీపీపై నమ్మకంతో, పార్టీ నాయకుడు కరణం ధర్మశ్రీ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
  • 16వ వార్డుకు చెందిన పెద్దలు దూది శ్రీరామమూర్తి, పిట్ట సత్తిబాబు, కిలాడ సత్యనారాయణల చొరవతో కరణం ధర్మశ్రీ సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం నిర్వహించారు.

ఎలమంచిలి మున్సిపాలిటీ 16వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన 150 మంది కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సేనాపతి తులసిరావు తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.వైఎస్సార్‌సీపీపై నమ్మకంతో, పార్టీ నాయకుడు కరణం ధర్మశ్రీ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. 16వ వార్డుకు చెందిన పెద్దలు దూది శ్రీరామమూర్తి, పిట్ట సత్తిబాబు, కిలాడ సత్యనారాయణల చొరవతో కరణం ధర్మశ్రీ సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోదెపు గోవింద్, బెజవాడ నాగేశ్వరరావు, బొద్దపు ఎర్రయ్య దొర తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *