Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

ఎరువుల సరఫరా సమస్యల పరిష్కారానికి చర్యలు త్వరలోనే రైతుల ఇబ్బందులు తొలగిస్తాం: ఎమ్మెల్యే నల్లమిల్లి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎరువుల సరఫరా సమస్యల పరిష్కారానికి చర్యలు త్వరలోనే రైతుల ఇబ్బందులు తొలగిస్తాం: ఎమ్మెల్యే నల్లమిల్లి

వార్త ముఖ్యాంశాలు

  • అనపర్తి, ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి): ఎరువుల సరఫరా, బుకింగ్‌ విధానంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.
  • అనపర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
  • ఇటీవల శాసనసభ సమావేశాల్లో ఎరువుల సరఫరా యాప్‌లలో రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

అనపర్తి, ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి): ఎరువుల సరఫరా, బుకింగ్‌ విధానంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇటీవల శాసనసభ సమావేశాల్లో ఎరువుల సరఫరా యాప్‌లలో రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఓటీపీ విధానం, ఎరువులను విడతల వారీగా పొందడం, డీఏపీ, యూరియా కేటాయింపులు, బుకింగ్‌ పరిమితుల కారణంగా రైతులకు కొంత ఇబ్బంది ఏర్పడుతోందన్నారు.

ఈ సమస్యలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు తనను కలిసి వివరాలు సేకరించారని, వాటిని కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలపై కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. అనంతరం సచివాలయంలో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వినియోగంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి నీటిని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు మెట్ట ప్రాంతాల్లోని చెరువులను నింపేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రబీ సీజన్‌లో పంటలతో పాటు తాగునీరు, పశువుల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.

పంట రకం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతకు అనుగుణంగా ఎరువులను వినియోగించాలని రైతులకు సూచించారు. సాగు ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకునేందుకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *