Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మౌన నిరసన.. పురుషోత్తపురంలో టీడీపీ శ్రేణుల ఆందోళన.!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మౌన నిరసన.. పురుషోత్తపురంలో టీడీపీ శ్రేణుల ఆందోళన.!

వార్త ముఖ్యాంశాలు

  • ఆర్బీకే ప్రారంభోత్సవం వేళ..
  • మౌన పోరాటం!
  • పున్నమి ప్రతినిధి ఆనంద్ పురుషోత్తపురం గ్రామంలో సోమవారం ఆర్బీకే ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మౌన పోరాటం చేపట్టారు.

ఆర్బీకే ప్రారంభోత్సవం వేళ.. మౌన పోరాటం!

పున్నమి ప్రతినిధి ఆనంద్

పురుషోత్తపురం గ్రామంలో సోమవారం ఆర్బీకే ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మౌన పోరాటం చేపట్టారు. కొలుకులూరి విజయరామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో అనకాపల్లి జిల్లా టీడీపీ వైస్‌ ప్రెసిడెంట్ రాజా వెంకట రమణరావు, మండల క్రస్టర్ ఇన్‌చార్జి ఊడి రామకృష్ణ, మండల ఆర్గనైజర్ సెక్రటరీ ఎడ్ల చిన్నబాబు, యూనిట్ ఇన్‌చార్జి రాజాన వెంకునాయుడు, మండల వైస్‌ కార్యదర్శి కాళ్ల సత్యనారాయణ, గ్రామ టీడీపీ అధ్యక్షుడు రెడ్డి నానాజీ పాల్గొన్నారు. అలాగే ముని, నాని, సూరిబాబు, కార్తీక్‌తో పాటు పలువురు మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై మౌనంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆర్బీకే ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ మౌన పోరాటంతో పురుషోత్తపురంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నాయకులు, కార్యకర్తలు ఎలాంటి నినాదాలు చేయకుండా మౌనంగా నిలబడి తమ నిరసనను తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *