Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఎన్నికల ఓటింగ్‌కు విద్యుత్ అంతరాయం కలగకుండా పహారా!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎన్నికల ఓటింగ్‌కు విద్యుత్ అంతరాయం కలగకుండా పహారా!

వార్త ముఖ్యాంశాలు

  • పోలింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం సిబ్బంది ప్రత్యేక చర్యలు యలమంచిలి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు.
  • ఏఈ కనకరాజు, లైన్‌మెన్ ఆచంట ఆదినారాయణ సారథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన ఉదయం నుంచి బ్యాలెట్ బాక్సులు తరలించే ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యుత్ సరఫరాపై నిరంతరం నిఘా ఉంచారు.
  • ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమస్యలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు.ఎన్నికల వంటి కీలక సమయంలో పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు ఏఈ కనకరాజు, లైన్‌మెన్ ఆచంట ఆదినారాయణతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది చూపిన…

పోలింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం సిబ్బంది ప్రత్యేక చర్యలు

యలమంచిలి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. ఏఈ కనకరాజు, లైన్‌మెన్ ఆచంట ఆదినారాయణ సారథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన ఉదయం నుంచి బ్యాలెట్ బాక్సులు తరలించే ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యుత్ సరఫరాపై నిరంతరం నిఘా ఉంచారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమస్యలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు.ఎన్నికల వంటి కీలక సమయంలో పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు ఏఈ కనకరాజు, లైన్‌మెన్ ఆచంట ఆదినారాయణతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది చూపిన అంకితభావం పలువురి ప్రశంసలు అందుకుంది. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన విద్యుత్ శాఖ సిబ్బందిని పలువురు అభినందించారు.

వార్తా మూలాలు

  • కె. ఆనంద్పత్రిక / వెబ్‌సైట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *