వార్త ముఖ్యాంశాలు
- -- నెల్లూరు కార్పొరేషన్‌తో సహా అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కూటమి -- అన్ని చోట్లా రెక్కలు విరిగిన ఫ్యాన్ --నెల్లూరు మేయర్‌గా రూప్ కుమార్ ఈ నెల 1వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగగా, ఉమ్మడి…
- ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన ఆత్మకూరు, బుచ్చి, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది.
- అలాగే నెల్లూరు కార్పొరేషన్‌లోనూ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రూప్ కుమార్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
— నెల్లూరు కార్పొరేషన్‌తో సహా అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కూటమి
— అన్ని చోట్లా రెక్కలు విరిగిన ఫ్యాన్
–నెల్లూరు మేయర్‌గా రూప్ కుమార్
ఈ నెల 1వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగగా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్‌తో సహా అన్ని మున్సిపాలిటీలను కూటమి కైవసం చేసుకుంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన ఆత్మకూరు, బుచ్చి, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే నెల్లూరు కార్పొరేషన్‌లోనూ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రూప్ కుమార్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 72 డివిజన్లు ఉండగా, అధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులే (ఈ వార్త రాసే సమయానికి) ముందంజలో ఉన్నారు. గెలిచిన వారంతా మంచి మెజారిటీలనే సాధించారు. దీంతో ఇటు నెల్లూరులోనూ, అటు ఇతర మున్సిపాలిటీల్లోనూ కూటమి శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కౌంటింగ్ ప్రశాంతంగా జరిగింది. నెల్లూరుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు డీకేడబ్ల్యూ కళాశాలలో జరగగా, ప్రశాంత వాతావరణంలో ఈ కౌంటింగ్ పూర్తయింది. పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి శాంతిభద్రతలను పర్యవేక్షించింది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్