అంబేద్కర్ విగ్రహం నుంచి బోగోలు బజార్ వరకు కొనసాగిన ర్యాలీ
పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
బోగోలు మండలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, అభ్యర్థుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బోగోలు మండల జడ్పీటీసీ అభ్యర్థి కర్తం సురేందర్ రెడ్డి, విశ్వనాథరావుపేట బిట్-1, బిట్-2 ఎంపీటీసీ అభ్యర్థులు బొడ్డు నిర్మల్ కుమార్, గోపిశెట్టి సంధ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ బోగోలు బజార్ వరకు కొనసాగింది. మధ్యలో విశ్వనాథరావుపేటలోని పలు వీధుల్లో నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి కర్తం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు సంబంధించిన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచి విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్