Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీసీల మద్దతు కూటమి ప్రభుత్వానికే – మల్లె కృష్ణయ్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బీసీల మద్దతు కూటమి ప్రభుత్వానికే – మల్లె కృష్ణయ్య

దుత్తలూరు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం మంగళవారం ముమ్మరంగా సాగింది. ఈ సందర్భంగా మండల బీసీ నాయకులు మల్లె కృష్ణయ్య, చల్లా ప్రసాద్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని బీసీ వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని మల్లె కృష్ణయ్య పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, రైతు భరోసా, అధిక పింఛన్లు, ఉచిత గ్యాస్ వంటి పథకాలను ప్రజలకు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు బీసీ వర్గాలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

బీసీల మద్దతు కూటమి ప్రభుత్వానికే – మల్లె కృష్ణయ్య

Leave a comment

Your email address will not be published. Required fields are marked *