వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి సర్కిల్ పరిధిలోని ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, మర్రిపాడు మండలాల్లో ఉన్న మద్యం దుకాణాలను ఎక్సైజ్ ఎస్ఐ దీప్తి కారంత్ తనిఖీ చేశారు.
- ఈ సందర్భంగా మద్యం నిల్వలు, విక్రయాల వివరాలను పరిశీలించి, దుకాణాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
- ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) కంటే అధిక ధరలకు మద్యం విక్రయించినా, అక్రమ బెల్ట్ దుకాణాలను ప్రోత్సహించినా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉదయగిరి సర్కిల్ పరిధిలోని ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, మర్రిపాడు మండలాల్లో ఉన్న మద్యం దుకాణాలను ఎక్సైజ్ ఎస్ఐ దీప్తి కారంత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మద్యం నిల్వలు, విక్రయాల వివరాలను పరిశీలించి, దుకాణాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) కంటే అధిక ధరలకు మద్యం విక్రయించినా, అక్రమ బెల్ట్ దుకాణాలను ప్రోత్సహించినా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.