Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కలిగిరి మండలంలో 13 MPTC స్థానాల ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్ధులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కలిగిరి మండలంలో 13 MPTC స్థానాల ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్ధులు

వార్త ముఖ్యాంశాలు

  • కలిగిరి, తేది: 27-10-2026, పున్నమి ప్రతినిధి .
  • స్థానిక సంస్థల సమరంలో కలిగిరి మండలం పొలిటికల్ హీట్ పెంచుతోంది.
  • మండలంలోని మొత్తం 13 MPTC స్థానాలకు జరిగే ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో పోరు రసవత్తరంగా మారింది.

కలిగిరి, తేది: 27-10-2026, పున్నమి ప్రతినిధి . స్థానిక సంస్థల సమరంలో కలిగిరి మండలం పొలిటికల్ హీట్ పెంచుతోంది. మండలంలోని మొత్తం 13 MPTC స్థానాలకు జరిగే ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో పోరు రసవత్తరంగా మారింది. మండలంలోని అన్ని MPTC స్థానాలను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా అధికార తెలుగుదేశం పార్టీ (TDP) సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేలా, స్థానికంగా బలమైన పట్టున్న ధీటైన అభ్యర్థులను రంగంలోకి దించింది. పక్కా వ్యూహాలతో గ్రామ గ్రామాన ప్రచారాన్ని హోరెత్తిస్తూ MPP పీఠాన్ని కైవసం చేసుకోవడమే ధ్యేయంగా కదులుతోంది. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సైతం ఎక్కడా తగ్గడం లేదు. అధికార పార్టీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే పట్టుదలతో, ఎక్కడా ఏకగ్రీవాలకు తావివ్వకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. మొత్తం 13 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెట్టి, సవాల్ విసురుతోంది. బరిలో బీఎస్పీ సైతం ఈ ప్రధాన పార్టీల హోరాహోరీ పోరు నడుమ జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీ (BSP) కూడా తన ఉనికిని చాటుకుంటోంది. మండలంలోని 2 MPTC స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కలిగిరి మండల MPTC ఎన్నికలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారాయి. గెలుపు ఎవరిదో తేలాలంటే పోలింగ్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *