వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: ఉదయగిరి ఆర్అండ్బీ అతిథి గృహంలో బీజేపీ మండల పదాధికారుల సమావేశం మండల అధ్యక్షురాలు, ఏఎంసీ చైర్పర్సన్ పి.
- విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.
- ప్రతి నెల 1వ తేదీన నిర్వహించే సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులు చర్చించారు.
ఉదయగిరి: ఉదయగిరి ఆర్అండ్బీ అతిథి గృహంలో బీజేపీ మండల పదాధికారుల సమావేశం మండల అధ్యక్షురాలు, ఏఎంసీ చైర్పర్సన్ పి. విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ప్రతి నెల 1వ తేదీన నిర్వహించే సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులు చర్చించారు. ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించారు. మండలంలోని ప్రతి పంచాయతీ, ప్రతి బూత్లో బీజేపీ జెండాను ఆవిష్కరించేలా కార్యాచరణ రూపొందించారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని నాయకులు సూచించారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, రాబోయే కార్యక్రమాల నిర్వహణపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, మండల పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.