వార్త ముఖ్యాంశాలు
- ఈ నెల 16 నుంచి 18 వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నామినేషన్ల దాఖలుకు అనుమతి ఇవ్వడంతో తొలి రోజైన శుక్రవారం కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేయడం మొదలైంది.
- జిల్లాలో ఈ నామినేషన్లు ప్రశాంతంగా జరగగా, రాష్ట్రంలోని రాయచోటి, పుంగనూరు తదితర ప్రాంతాల్లో రక్తసిక్తంగా, అల్లర్ల మధ్య జరిగాయి.
- టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య అక్కడక్కడా వాగ్వాదాలు, రాళ్లు రువ్వుకోవడాలు జరిగాయి.
ఈ నెల 16 నుంచి 18 వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నామినేషన్ల దాఖలుకు అనుమతి ఇవ్వడంతో తొలి రోజైన శుక్రవారం కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేయడం మొదలైంది.
జిల్లాలో ఈ నామినేషన్లు ప్రశాంతంగా జరగగా, రాష్ట్రంలోని రాయచోటి, పుంగనూరు తదితర ప్రాంతాల్లో రక్తసిక్తంగా, అల్లర్ల మధ్య జరిగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య అక్కడక్కడా వాగ్వాదాలు, రాళ్లు రువ్వుకోవడాలు జరిగాయి. ముఖ్యంగా పుంగనూరు ప్రాంతంలో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి.
ఇక నామినేషన్లకు రెండు రోజులే గడువు మిగిలి ఉన్నందున, ఈ రెండు రోజులైనా ఘర్షణలు, అల్లర్లు జరగకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తటస్థమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.