వార్త ముఖ్యాంశాలు
- ఆరోగ్యానికి నడక దిన చర్య కావాలి .........నడక కవి నల్లా నరసింహమూర్తి అమలాపురం జూలై 17 ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ నడకను దినచర్యగా పాటించాలని, నడక శరీరానికి అతి తక్కువ శ్రమతో ఎక్కువ గాలిని పీల్చే లా చేస్తుందని అలా చేయడం వల్ల ఊపిరితిత్తులు ఎక్కువ…
- అమలాపురం డాబా గార్డెన్స్ లో శుక్రవారం ఉదయం జరిగిన నడిపూడి వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన జూలై నెలకు సంబంధించిన నెలవారీ ఆరోగ్య సదస్సులో ఆయన ప్రసంగించారు.
- నడక శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థను గుండె , ఊపిరితిత్తుల వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచుతుందని ,గుండె సమర్థవంతంగా పనిచేసి రక్తాన్ని ఎక్కువగా తోడుతుందని దీనివల్ల గుండెకు బలం చేకూరుతుందని, నడక వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఆయన వివరించారు.
ఆరోగ్యానికి నడక దిన చర్య కావాలి
………నడక కవి నల్లా నరసింహమూర్తి
అమలాపురం జూలై 17
ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ నడకను దినచర్యగా పాటించాలని, నడక శరీరానికి అతి తక్కువ శ్రమతో ఎక్కువ గాలిని పీల్చే లా చేస్తుందని అలా చేయడం వల్ల ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్ గ్రహించి రక్త కణాలకు అందజేసి శక్తి ని ఉత్పత్తి చేసే ఆహారంతో మిళితమయ్యే లా చేస్తుందని నడక కవి , నడక సాహిత్య సృష్టికర్త,ప్రముఖ సాహితీవేత్త , సీనియర్ తెలుగు లెక్చరర్, అమలాపురం నడిపూడి వాకర్స్ ఆరోగ్య సేవా సంస్థ కార్యదర్శి, నడక కవి నల్లా నరసింహమూర్తి అన్నారు. అమలాపురం డాబా గార్డెన్స్ లో శుక్రవారం ఉదయం జరిగిన నడిపూడి వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన జూలై నెలకు సంబంధించిన నెలవారీ ఆరోగ్య సదస్సులో ఆయన ప్రసంగించారు. నడక శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థను గుండె , ఊపిరితిత్తుల వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచుతుందని ,గుండె సమర్థవంతంగా పనిచేసి రక్తాన్ని ఎక్కువగా తోడుతుందని దీనివల్ల గుండెకు బలం చేకూరుతుందని, నడక వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఆయన వివరించారు. సభకు నడిపూడి వాకర్స్ లాఫింగ్ క్లబ్ అధ్యక్షులు , ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ బివివి సత్యనారాయణ
అధ్యక్షత వహించారు.
.కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి నిమ్మకాయల సురేష్ క్లబ్ జాలి వాకర్ వై. ఆర్ .కె .నాగేశ్వరరావు, క్లబ్బు ఉపాధ్యక్షు రాలు సూర్య కళ , సహాయ కార్యదర్శిడాక్టర్ శ్రీపాద రామకృష్ణ, పాల్గొని ప్రసంగించారు.