Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరు నామినేషన్లలో టీడీపీ ఆధిక్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరు నామినేషన్లలో టీడీపీ ఆధిక్యం

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి):వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆత్మకూరు పట్టణానికి చెందిన అల్లారెడ్డి ఇందుమతి చే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, పట్టణ వైసీపీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాపరెడ్డి నామినేషన్ దాలు చేయించారు.
  • ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో నిలిచింది.
  • మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డులకు సంబంధించి శనివారం నాటికి మొత్తం 41 నామినేషన్లు దాఖలయ్యాయి.వీటిలో టీడీపీ తరఫున అత్యధికంగా 26 నామినేషన్లు దాఖలు కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 13 నామినేషన్లు నమోదయ్యాయి.

41 నామినేషన్లలో టీడీపీ నుంచి 26, వైసీపీ నుంచి 13, ఇండిపెండెంట్ 2

ఆత్మకూరు, అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి):వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆత్మకూరు పట్టణానికి చెందిన అల్లారెడ్డి ఇందుమతి చే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, పట్టణ వైసీపీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాపరెడ్డి నామినేషన్ దాలు చేయించారు. ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో నిలిచింది. మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డులకు సంబంధించి శనివారం నాటికి మొత్తం 41 నామినేషన్లు దాఖలయ్యాయి.వీటిలో టీడీపీ తరఫున అత్యధికంగా 26 నామినేషన్లు దాఖలు కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 13 నామినేషన్లు నమోదయ్యాయి. మరో రెండు నామినేషన్లను స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేశారు.ఇప్పటివరకు నమోదైన నామినేషన్లలో టీడీపీ ముందంజలో ఉండగా, వైసీపీ రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు.బీఎస్పీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎన్‌సీపీ, జనసేన పార్టీల నుంచి శనివారం నాటికి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు.మొత్తం 28 వార్డులున్న ఆత్మకూరు మున్సిపాలిటీలో నామినేషన్ల సంఖ్య, వివిధ పార్టీల అభ్యర్థుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే నాటికి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యతో పాటు ప్రధాన పార్టీల బలాబలాలపై స్పష్టత రానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *