Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అభిమానుల మధ్య ఆనందంగా.. చంద్రశేఖర్‌రెడ్డి 66వ జన్మదిన వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అభిమానుల మధ్య ఆనందంగా.. చంద్రశేఖర్‌రెడ్డి 66వ జన్మదిన వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్‌ మండలం తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన ప్రజాసేవకుడు నాగిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి 66వ జన్మదిన వేడుకలు శుక్రవారం ఆయన నివాసంలో చిట్వేల్ లో ఘనంగా నిర్వహించారు.
  • కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
  • ప్రజాసేవకుడు నాగిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడైన చంద్రశేఖర్‌రెడ్డి ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు.

తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేల్‌ మండలం తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన ప్రజాసేవకుడు నాగిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి 66వ జన్మదిన వేడుకలు శుక్రవారం ఆయన నివాసంలో చిట్వేల్ లో ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ప్రజాసేవకుడు నాగిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడైన చంద్రశేఖర్‌రెడ్డి ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం రెడ్డీస్‌ అసోసియేషన్‌ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కువైట్‌ ఎక్స్‌ అడ్వైజర్‌గా, గల్ఫ్‌ కోర్‌ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ చంద్రశేఖర్‌రెడ్డి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *