వార్త ముఖ్యాంశాలు
- ⛔అపాచీలో పనిచేస్తూ కార్మికుడు మృతి ⛔12 గంటల పని ఒత్తిడితోనే కార్మికుల ఉసురు తీస్తున్నారా?
- ⛔కార్మిక సంఘాలు హెచ్చరికBRK న్యూస్ తడ తిరుపతి జిల్లా తడ మండలం మాంబట్టు సెజ్ లో గురువారం కార్మికుడు పనిచేస్తూ ముందుకు పడి చనిపోయాడు.
- అపాచీ ఫుట్ వేర్ కంపెనీలో కార్మికుల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
⛔అపాచీలో పనిచేస్తూ కార్మికుడు మృతి ⛔12 గంటల పని ఒత్తిడితోనే కార్మికుల ఉసురు తీస్తున్నారా? ⛔కార్మిక సంఘాలు హెచ్చరికBRK న్యూస్ తడ తిరుపతి జిల్లా తడ మండలం మాంబట్టు సెజ్ లో గురువారం కార్మికుడు పనిచేస్తూ ముందుకు పడి చనిపోయాడు. అపాచీ ఫుట్ వేర్ కంపెనీలో కార్మికుల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత కొన్ని నెలల్లో అనుమానాస్పద రీతిలో పలువురు కార్మికులు మరణించడం, దానికి కారణం యాజమాన్యం పెడుతున్న 12 గంటల అమానుష పని ఒత్తిడే అని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.చట్ట ప్రకారం 8 గంటలు పని చేయించాలి. కానీ అపాచీలో బలవంతంగా 12 గంటలు, ఒక్కోసారి 14 గంటలు పని చేయిస్తున్నారని కార్మికుల ఆరోపిస్తున్నారు.విపరీతమైన పని ఒత్తిడి, సరైన విశ్రాంతి లేకపోవడం, ఫ్యాక్టరీలో వేడి, సరైన వైద్య సౌకర్యం లేకపోవడంతో గుండెపోటు, ఇతర అనారోగ్యాలతో కార్మికులు మరణిస్తున్నారని తోటి కార్మికులు చెబుతున్నారు.మరణాల గురించి బయట మాట్లాడితే ఉద్యోగం నుండి తీసేస్తామని యాజమాన్యం బెదిరిస్తోందని సమాచారం.మేము మనుషులమా? మిషన్లమా? 12 గంటలు నిలబడి పని చేస్తే కాళ్లు చేతులు పడిపోతున్నాయి. టార్గెట్ పేరుతో టార్చర్ పెడుతున్నారు. మా స్నేహితులు కళ్ల ముందే కుప్పకూలి చనిపోతున్నారు. ఇది హత్య కాదా?” అని అపాచీ కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇన్ని మరణాలు జరుగుతున్నా లేబర్ శాఖ, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కంపెనీ నుండి ముడుపులు అందుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అపాచీలో జరిగిన వరస మరణాలపై జిల్లా కలెక్టర్, లేబర్ కమిషనర్ సంయుక్త విచారణ జరపాలని,చట్టవిరుద్ధంగా 12 గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేసి, 8 గంటల పనినే అమలు చేయాలని,మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.నిర్లక్ష్యంగా వ్యవహరించిన అపాచీ యాజమాన్యంపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని కార్మిక సంఘాల డిమాండ్ చేస్తున్నాయి.
