Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

అనకాపల్లి జిల్లాకు సొంత జిల్లా పరిషత్ కార్యాలయం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అనకాపల్లి జిల్లాకు సొంత జిల్లా పరిషత్ కార్యాలయం!

వార్త ముఖ్యాంశాలు

  • ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేలు, కలెక్టర్..
  • నూర్‌భాషా కార్పొరేషన్ డైరెక్టర్ ఇబ్రహీం భాషా పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) అనకాపల్లి: విశాఖపట్నం జిల్లా నుంచి విడిపోయి అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని అనకాపల్లిలో ప్రారంభించారు.
  • శుక్రవారం జరిగిన కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆహ్వానం మేరకు రాష్ట్ర నూర్‌భాషా కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ఇబ్రహీం భాషా హాజరయ్యారు.

ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేలు, కలెక్టర్.. నూర్‌భాషా కార్పొరేషన్ డైరెక్టర్ ఇబ్రహీం భాషా

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)

అనకాపల్లి: విశాఖపట్నం జిల్లా నుంచి విడిపోయి అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయాన్ని అనకాపల్లిలో ప్రారంభించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆహ్వానం మేరకు రాష్ట్ర నూర్‌భాషా కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ఇబ్రహీం భాషా హాజరయ్యారు.
కార్యక్రమానికి అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకుడు ఈర్ల శ్రీరామ్‌మూర్తి, జిల్లా పరిషత్ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, పీడీతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల పరిపాలన మరింత సమన్వయంతో ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆకాంక్షించారు. నూతన జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభంతో పరిపాలనా కార్యక్రమాలకు మరింత సౌలభ్యం కలగనుందని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *