Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిన వ్యాన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిన వ్యాన్

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి) దేవరపల్లి మండలంలోని యర్రగూడెం గండి చెరువు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
  • నిడదవోలు మండలం కొరవమిడి నుంచి విజయవాడకు సాండ్ సిస్టం పరికరాలను తీసుకుని వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది.
  • ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి)
దేవరపల్లి మండలంలోని యర్రగూడెం గండి చెరువు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిడదవోలు మండలం కొరవమిడి నుంచి విజయవాడకు సాండ్ సిస్టం పరికరాలను తీసుకుని వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద పరిస్థితులను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *