Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి మానవత చేయూత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి మానవత చేయూత

వార్త ముఖ్యాంశాలు

  • - రూ.33 వేల ఆర్థిక సాయం అందజేత చిట్వేల్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది.
  • మండల కేంద్రమైన చిట్వేల్‌లోని సింగనమల వీధిలో గురువారం రాత్రి టంగుటూరి మస్తాన్‌కు చెందిన పూరిగుడిసె ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది.
  • విషయం తెలుసుకున్న మానవత సంస్థ చిట్వేల్ శాఖ సభ్యులు శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.

– రూ.33 వేల ఆర్థిక సాయం అందజేత

చిట్వేల్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. మండల కేంద్రమైన చిట్వేల్‌లోని సింగనమల వీధిలో గురువారం రాత్రి టంగుటూరి మస్తాన్‌కు చెందిన పూరిగుడిసె ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న మానవత సంస్థ చిట్వేల్ శాఖ సభ్యులు శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. సంస్థ తరఫున రూ.10 వేల చెక్కుతో పాటు దాతల నుంచి సమకూరిన రూ.23 వేల నగదును కలిపి మొత్తం రూ.33 వేల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే చిట్వేల్‌కు చెందిన దొండ్లవాగు మధుసూదన్ కుటుంబ సభ్యులు రూ.5 వేల నగదును అందించారు. భవిష్యత్తులోనూ దాతల సహకారం అందితే బాధిత కుటుంబానికి మరింత చేయూతనిస్తామని మానవత సభ్యులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మానవత అధ్యక్షుడు దొడ్లవాగు శ్రీనివాసులు, చైర్మన్ వీరాంజనేయులు, కోచైర్మన్ మునిరావు, కన్వీనర్ సాయిరాం, కార్యదర్శి సుబ్రహ్మణ్యం రెడ్డి, సలహా మండలి సభ్యులు కావేరి చంద్ర, సభ్యులు కంచర్ల సుధీర్‌రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *