Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

వార్త ముఖ్యాంశాలు

  • -- నెలకు రూ.42 వేల కనీస వేతనం ఇవ్వాలి --నెల్లూరులో సీఐటీయూ కార్మిక ర్యాలీ నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని సీఐటీయూ నగర కమిటీ డిమాండ్ చేసింది.
  • సీఐటీయూ నగర కమిటీ, కొట్టు ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్టోన్‌హౌస్‌పేట నుంచి పప్పుల వీధి మీదుగా వాటర్ ట్యాంక్ ప్రాంతం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు.
  • నెలకు రూ.42 వేల కనీస వేతనం చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు కోరారు.

— నెలకు రూ.42 వేల కనీస వేతనం ఇవ్వాలి
–నెల్లూరులో సీఐటీయూ కార్మిక ర్యాలీ
నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని సీఐటీయూ నగర కమిటీ డిమాండ్ చేసింది. సీఐటీయూ నగర కమిటీ, కొట్టు ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్టోన్‌హౌస్‌పేట నుంచి పప్పుల వీధి మీదుగా వాటర్ ట్యాంక్ ప్రాంతం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. నెలకు రూ.42 వేల కనీస వేతనం చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు కోరారు. స్కీమ్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కార్మికులకు పెన్షన్ కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నగర కార్యదర్శి జి. నాగేశ్వరరావు కోరారు. డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో నిర్వహించే కార్మిక పోరాటంలో జిల్లా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ర్యాలీలో కత్తి శ్రీనివాసులు, పి. సుధాకర్, స్వర్ణబాబు తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *