వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 20 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్‌గా పొట్టేలు ప్రసాద్ నియమితులయ్యారు.
- శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి హిమాన్షు శుక్ల ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
- అనంతరం పొట్టేలు ప్రసాద్ మాట్లాడుతూ మనుబోలు మండలంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 20 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్‌గా పొట్టేలు ప్రసాద్ నియమితులయ్యారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి హిమాన్షు శుక్ల ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పొట్టేలు ప్రసాద్ మాట్లాడుతూ మనుబోలు మండలంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని, మండల అభివృద్ధికి నిరంతరం కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన మా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరియు మండలంలోని .ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్