Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పోలంరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పోలంరెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • - వైస్ చైర్మన్‌గా పొట్టెల్ల ప్రసాద్ - ఏకగ్రీవ ఎంపికలు నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్‌గా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నుంచి జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎంపికైన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
  • అలాగే వైస్ చైర్మన్‌గా పొట్టెల్ల ప్రసాద్ ఎంపికయ్యారు.
  • వీరిద్దరి చేత అధికారులు అధికారపూర్వకంగా ప్రమాణ స్వీకారం చేయించారు.

– వైస్ చైర్మన్‌గా పొట్టెల్ల ప్రసాద్
– ఏకగ్రీవ ఎంపికలు
నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్‌గా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నుంచి జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎంపికైన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అలాగే వైస్ చైర్మన్‌గా పొట్టెల్ల ప్రసాద్ ఎంపికయ్యారు. వీరిద్దరి చేత అధికారులు అధికారపూర్వకంగా ప్రమాణ స్వీకారం చేయించారు.

కాగా, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలోని అందరికీ చిరపరిచితులే. పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయడంతో జిల్లాలోని ఆయన అభిమానులు, దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గ దేశం శ్రేణులు ఈ ఆనందాన్ని మరింతగా పంచుకున్నారు. కాగా, ఆయన స్వగ్రామం కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *