ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘పల్లె పండుగ–3.0’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రామాపురం పరిసర ప్రాంతాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

చంద్రబాబుకు ఘన స్వాగతం