వార్త ముఖ్యాంశాలు
- రాంబిల్లి: అప్పన్నపాలెం, గొరపూడి, ఎస్ఈజెడ్ భూ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం, పునరావాసం, ఉపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రీ అప్పారావు, జిల్లా నాయకుడు ఎన్.నారాయణరావు డిమాండ్ చేశారు.
- మంగళవారం నిర్వాసిత రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
- ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అప్పన్నపాలెం, గొరపూడి ప్రాంతాల్లో రైతుల భూముల చుట్టూ సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేసి, ఇనుప మెష్లు బిగించినా పరిహారం చెల్లించకపోవడం అన్యాయమన్నారు.
రాంబిల్లి: అప్పన్నపాలెం, గొరపూడి, ఎస్ఈజెడ్ భూ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం, పునరావాసం, ఉపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రీ అప్పారావు, జిల్లా నాయకుడు ఎన్.నారాయణరావు డిమాండ్ చేశారు. మంగళవారం నిర్వాసిత రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అప్పన్నపాలెం, గొరపూడి ప్రాంతాల్లో రైతుల భూముల చుట్టూ సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేసి, ఇనుప మెష్లు బిగించినా పరిహారం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. రైతులకు అండగా ఉంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం, ప్రైవేట్ ఫార్మా కంపెనీలకు భూములు కేటాయిస్తూ నిర్వాసితుల ప్రయోజనాలను విస్మరించిందని విమర్శించారు.నష్టపరిహారం, పునరావాసం, ఉపాధి కల్పించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే నిర్వాసితులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు జి.దేవుడు నాయుడు, కూండ్రపు సోము నాయుడు, నిర్వాసిత రైతులు పాల్గొన్నారు.