వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) అనకాపల్లి: రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అనకాపల్లి రూరల్ పోలీసులు సీతానగరం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
- జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఈ.
- శ్రీనివాసులు సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు.
పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)
అనకాపల్లి: రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అనకాపల్లి రూరల్ పోలీసులు సీతానగరం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఈ. శ్రీనివాసులు సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు, యువతతో పోలీసులు సమావేశమై ఎన్నికల సమయంలో సత్ప్రవర్తనతో మెలగాలని, గొడవలు, వర్గ విభేదాలకు దూరంగా ఉండాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైన సందర్భాల్లో నిఘా కొనసాగించడంతో పాటు రౌడీషీట్లు తెరవడం, బైండ్ఓవర్ చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
అలాగే బాల్య వివాహాల దుష్పరిణామాలు, మహిళా భద్రతకు సంబంధించిన అభయ యాప్, శక్తి టీమ్, డయల్ 100, 112 సేవలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా మరియు ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసం జరిగితే వెంటనే 1930కు సమాచారం అందించాలని సూచించారు. యువత మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని పోలీసులు సూచించారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి రూరల్ సీఐ జి. అశోక్ కుమార్, ఎస్ఐ జి. రవి కుమార్, హెడ్ కానిస్టేబుల్ కేటీఎన్ శ్రీనివాస్, వి. సతీష్, కానిస్టేబుల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.