Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు నూతన ఎస్సై మహేంద్రకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుభాకాంక్షలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు నూతన ఎస్సై మహేంద్రకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుభాకాంక్షలు

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు: మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మహేంద్ర, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనతో ఆప్యాయంగా మాట్లాడి, నూతన బాధ్యతల స్వీకరణకు శుభాకాంక్షలు తెలిపారు.
  • మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

దుత్తలూరు: మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మహేంద్ర, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనతో ఆప్యాయంగా మాట్లాడి, నూతన బాధ్యతల స్వీకరణకు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, పోలీసు సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి, దుత్తలూరు మండలంలో శాంతిభద్రతలను పటిష్టంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *