Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అంబాజీపేటలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు సన్నాహాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అంబాజీపేటలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు సన్నాహాలు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

అంబేద్కర్ కోనసీమ జిల్లా | అంబాజీపేట: జనసేనాని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అంబాజీపేటలో వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
సెప్టెంబర్ 2న ఘనంగా వేడుకలు.. పవన్ కళ్యాణ్ కటౌట్ ఆవిష్కరణ
చిరు–పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా అంబాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా యువకులు స్వయంగా ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ కటౌట్‌ను శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కటౌట్ ఆవిష్కరణ సందర్భంగా డప్పు వాయిద్యాలు, విద్యుత్ వెలుగులు, బాణాసంచా కాల్పులతో సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో సూదాబత్తుల రమేష్, పిల్లా రాజా, రవణం విజయ్,దున్నాల సురేంద్ర,పళ్ళ సురేష్, పళ్ళ తేజ,పళ్ళ రాము, యాతం మూర్తి, వక్కపట్ల సుభాష్, పోతు సందీప్, పేరా బత్తుల అజయ్,రంకిరెడ్డి రఘురామ్,సూదాబత్తుల వినయ్, కొర్లపాటి అభిషేక్, ప్రేమ్ సాయి,చిన్న తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *