వార్త ముఖ్యాంశాలు
- ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి..
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా!
- ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: డీఎస్పీ సుంకర మురళీమోహన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అప్రమత్తమైంది.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా!
ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: డీఎస్పీ సుంకర మురళీమోహన్
అంబేద్కర్ కోనసీమ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ సిబ్బందితో కలిసి రాజోలు నియోజకవర్గ పరిధిలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
అనంతరం రాజోలు పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ.. గత 15 రోజులుగా ఎన్నికలకు సంబంధించిన పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు, కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తామని వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.