संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: పాలిటిక్స్

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ ఛైర్మన్ బీసీ మహిళకు కేటాయిస్తే

*జిల్లా పరిషత్ ఛైర్మన్ బీసీ మహిళకు కేటాయిస్తే* అంబేద్కర్ కోనసీమ తొలి జెడ్పీ పీఠంపై బీసీ మహిళా నాయకత్వం బీసీ మహిళకు అవకాశం దక్కితే రెడ్డి అనంత కుమారి పేరును పరిశీలించాలంటున్న బీసీ వర్గాలు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలనే నేపథ్యంలో.. డా. బి.ఆర్. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా తొలి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవిని బీసీ మహిళకు కేటాయిస్తే, ఆ బాధ్యతలకు శ్రీమతి రెడ్డి అనంత కుమారి పేరును పరిశీలించాలనే అభిప్రాయాలు బీసీ వర్గాలు, మహిళలు, పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. *స్థానిక సంస్థల పాలనలో అనుభవం రెడ్డి అనంత కుమారి ఐదేళ్ల పాటు ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల పాలన, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో మమేకమై పనిచేసిన అనుభవం తన రాజకీయ ప్రస్థానంలో కీలకంగా నిలిచిందని ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా కీలక బాధ్యతలు డా. బి.ఆర్. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా కూడా అనంత కుమారి బాధ్యతలు నిర్వహించారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, జిల్లాలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం వంటి బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్‌ బీసీ కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. బీసీ వర్గాల సంక్షేమం, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలపై పనిచేస్తున్న నేపథ్యంలో.. బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే నాయకురాలిగా ఆమెకు మరింత గుర్తింపు లభించిందని అనుచరులు చెబుతున్నారు. ఐదేళ్ల ఎంపీపీగా స్థానిక సంస్థల పరిపాలనా అనుభవం, జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా పార్టీ బాధ్యతలు, ప్రస్తుతం రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న అనుభవం.. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవికి అనంత కుమారి పేరును పరిశీలించాలని ఆమె అభిమానులు, అనుచరులు, బీసీ సంఘాల నాయకులు కోరుతున్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత తొలి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవిని బీసీ మహిళకు కేటాయిస్తే, అది బీసీ మహిళా నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. బీసీ మహిళకు అవకాశం.. కోనసీమకు తొలి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌.. రెడ్డి అనంత కుమారి పేరును పరిశీలించాలి..అనే ఆకాంక్ష బీసీ వర్గాలు, మహిళలు, ఆమె అభిమానులు మరియు అనుచరుల్లో వ్యక్తమవుతోంది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వాడపాలెంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

*ప్రజా దర్బార్ ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి…* వాడపాలెంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వారం, వారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు తెలిపారు. ఇదే రీతిలో గ్రామ స్థాయిలోని ప్రతి నాయకుడు వారంలో ఒక రోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేటాయించాలని ఆయన సూచించారు. శుక్రవారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా, సులభంగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నామన్నారు. స్థానిక నాయకులు సైతం అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు. ప్రజాదర్బార్ లో భాగంగా ప్రజల నుంచి ఎమ్మెల్యేకు 16 వినతులు అందాయి. పలు సమస్యలను ఎమ్మెల్యే అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆత్రేయపురం మండలంలో తెలుగుదేశం పార్టీకి ఫుల్ జోష్

*ఆత్రేయపురం మండలంలో తెలుగుదేశం పార్టీకి ఫుల్ జోష్…* నార్కెడిమిల్లిలో వైసీపీని వీడి టీడీపీ లో చేరిన 80 కుటుంబాలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే సత్యానందరావు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో తెలుగుదేశం పార్టీ ఫుల్ జోష్ వచ్చింది. నార్కెడిమిల్లి గ్రామంలో వైసీపీ ని వీడి 80 కుటుంబాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనను మరియి ఎమ్మెల్యే సత్యానందరావు చేసిన అభివృద్ధికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయని, జగన్ కు ఒక్క అవకాశం ఇచ్చి తప్పు చేశామని వారి పార్టీ వారే బహిరంగంగా చెప్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల పైనే కాకుండా పారదర్శంగా కూటమి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించి 16 వేల మందికి పైగా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను జగన్ అవమానించడమే కాక దాడులు కూడా చేయిస్తున్నారని అందుకే జగన్ పద్దతి నచ్చకే పార్టీని వీడినట్లు 80 కుటుంబాలు ప్రకటించారన్నారు. ఇటీవల చేరికల సభ అని పేరవరంలో సమావేశం పెడితే అందులో ప్రశ్నించిన తమ కార్యకర్తనే అవమానించేలా వైసీపీ నాయకుడు మాట్లాడాడని కార్యకర్తకు విలువ ఇవ్వలేని వైసీపీ లో ఉండమని చెప్పారన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి అందునా తెలుగుదేశం పార్టీకి మద్దతు పెరుగుతుందని అది చూసి ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఇటీవల మార్పు మొదలైందని అనడం కళ్ల అని అన్నారు. కొత్తపేటలో వైసీపీ పార్టీ అంతమై మార్పు ముగుస్తుందని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బాలయోగి ఘాట్లో మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 75 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

బాలయోగి ఘాట్లో మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 75 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 75 వ జయంతి సందర్భంగా బాలయోగి ఘాట్ లోని ఆయన తనయుడు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కోనసీమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మహనీయుడు బాలయోగిని పలువురు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా. కూటమి నాయకులు.జగడం సత్యనారాయణ.ఎన్ఎస్ఎన్ వర్మ. సిరిగినీడి వెంకటేశ్వరరావు. మైపాల తాతాజీ. అరిగెల నాని. తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కొనసీమ ముద్దుబిడ్డ కి ఘనంగా పుట్టినరోజు వేడుకలు

కొనసీమ ముద్దుబిడ్డ కి ఘనంగా పుట్టినరోజు వేడుకలు.. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా పి. గన్నవరం మండలం రాజులపాలెం లో మాజీ లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా రాజులూ పాలెం పంచాయతీ ఏనుగుకాలువ వంతెన వద్ద ఎర్పాటు చేసిన బాలయోగి విగ్రహానికి పూల మాలతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు,ఈ కార్యక్రమంలో రాజులూపాలెం మాజీ ఎంపీటీసీ నక్కా వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ నేడు స్వర్గీయలు బాలయోగి ఉంటే నేడు కొనసీమకు రైల్వే వచ్చేది, ప్రభుత్వలు వస్తున్నాయి పోతున్నాయి మా కొనసీమ ప్రాంతం అభివృద్ధి పట్టించుకునే వారే లేరని వెంటనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చొరవ చూపి మా కొనసీమ ప్రజల చిరకాల కోరిక రైల్వే పనులు పూర్తి చేయాలనీ కోరటం జరిగింది, ఈ కార్యక్రమంలో నీటి సంఘ అధ్యక్షులు కొలనడ సత్యనారాయణ రాజు, మట్టపర్తి నాగార్జున, టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు కీలకం: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

*రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు కీలకం: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడుమూడి గ్రామంలో ఉడుముడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘ మహాజన సభ కార్యక్రమంలో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఎంతో కీలకమైనవని అన్నారు. రైతులకు అవసరమైన సమయంలో రుణ సదుపాయాలు అందించడంతో పాటు, వ్యవసాయ పెట్టుబడులకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన సంఘం చైర్మన్, సభ్యులు, సిబ్బంది, అలాగే హాజరైన రైతులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతులు సంఘం ద్వారా పొందుతున్న రుణాలను వ్యవసాయ అవసరాలకు సద్వినియోగం చేసుకుని, నిర్ణీత గడువులో సకాలంలో రుణాలను తిరిగి చెల్లించాలని సూచించారు. రుణాలను సక్రమంగా చెల్లించడం ద్వారా సంఘం ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని, తద్వారా భవిష్యత్తులో మరింత మంది రైతులకు రుణ సదుపాయాలు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు అనంతరం రైతులకు బ్యాంకు పాస్‌బుక్కులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సంఘం సభ్యులు, సిబ్బంది, రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్

మండల యాదవ సంగమ్ నూతన కార్యవర్గం ఎన్నిక

తేదీ: 13-09-2026 వరంగల్ జిల్లా, ఖానాపురం మండలం – ఖానాపూరo అన్ని గ్రామాల యాదవ కుల బంధువుల సమక్షంలో ఖానాపూర్ మండల యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది 🔹 అధ్యక్షులు: శ్రీ పులిగల యాదగిరి యాదవ్ గారు 🔹 ప్రధాన కార్యదర్శి: నాంచారి కుమారస్వామి యాదవ్ గారు 🔹 ఉపాధ్యక్షులు: దెబ్బేట ఉపేందర్ యాదవ్ గారు, నూనెల కుమారస్వామి యాదవ్ గారు 🔹 సహాయ కార్యదర్శులు: గాలి కుమారస్వామి యాదవ్ గారు, బూడిద ముఖేష్ యాదవ్ గారు 🔹 కోశాధికారులు: మిరాల సోమయ్య యాదవ్ గారు, ఆబోతు రవికుమార్ యాదవ్ 🔹 అకౌంటెంట్స్: భూష కుమారస్వామి యాదవ్ గబొల్లు మురళి యాదవ్ గారు 🔹 సోషల్ మీడియా ఇంచార్జ్: దేశ బోయిన పవన్ కుమార్ యాదవ్ అలాగే ఖానాపూర్ మండల యాదవ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉడుగుల రాజు యాదవ్ , కోడి మల్లేష్ యాదవ్ గార్లను ఎన్నుకోవడం జరిగింది. ఖానాపూర్ మండల యాదవ సంఘం ఎన్నికల నిర్వాహకులుగా వల్లే శ్రీనివాస్ యాదవ్ (PACS చైర్మన్), మాజీ సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్ యాదవ్; నీలారపు నరేందర్ యాదవ్ గారు, సర్పంచ్ ఆబోతు శ్రీలత–అశోక్ యాదవ్ గారు, సర్పంచ్ పిండి కుమార్ యాదవ్ గారు, మాజీ సర్పంచ్ బూస్ అశోక్ గారు , భూష బోయిన రాజ్ కుమార్ యాదవ్ ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు

ప్రతి ఇంటికి తెలుగుదేశం కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్

గోనెగండ్ల: గోనెగండ్ల పట్టణంలోని 233, 234, 235, 236, 237, 238 బూత్‌లలో “ప్రతి ఇంటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని నాయకులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లడమే “ప్రతి ఇంటికి తెలుగుదేశం” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల టీడీపీ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు. “ప్రతి ఇంటికి తెలుగుదేశం – ప్రతి కుటుంబానికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి” అనే నినాదంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.