డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ ఛైర్మన్ బీసీ మహిళకు కేటాయిస్తే
*జిల్లా పరిషత్ ఛైర్మన్ బీసీ మహిళకు కేటాయిస్తే* అంబేద్కర్ కోనసీమ తొలి జెడ్పీ పీఠంపై బీసీ మహిళా నాయకత్వం బీసీ మహిళకు అవకాశం దక్కితే రెడ్డి అనంత కుమారి పేరును పరిశీలించాలంటున్న బీసీ వర్గాలు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలనే నేపథ్యంలో.. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తొలి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయిస్తే, ఆ బాధ్యతలకు శ్రీమతి రెడ్డి అనంత కుమారి పేరును పరిశీలించాలనే అభిప్రాయాలు బీసీ వర్గాలు, మహిళలు, పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. *స్థానిక సంస్థల పాలనలో అనుభవం రెడ్డి అనంత కుమారి ఐదేళ్ల పాటు ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల పాలన, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో మమేకమై పనిచేసిన అనుభవం తన రాజకీయ ప్రస్థానంలో కీలకంగా నిలిచిందని ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా కీలక బాధ్యతలు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా కూడా అనంత కుమారి బాధ్యతలు నిర్వహించారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, జిల్లాలో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం వంటి బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. బీసీ వర్గాల సంక్షేమం, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలపై పనిచేస్తున్న నేపథ్యంలో.. బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే నాయకురాలిగా ఆమెకు మరింత గుర్తింపు లభించిందని అనుచరులు చెబుతున్నారు. ఐదేళ్ల ఎంపీపీగా స్థానిక సంస్థల పరిపాలనా అనుభవం, జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా పార్టీ బాధ్యతలు, ప్రస్తుతం రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న అనుభవం.. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవికి అనంత కుమారి పేరును పరిశీలించాలని ఆమె అభిమానులు, అనుచరులు, బీసీ సంఘాల నాయకులు కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత తొలి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయిస్తే, అది బీసీ మహిళా నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. బీసీ మహిళకు అవకాశం.. కోనసీమకు తొలి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్.. రెడ్డి అనంత కుమారి పేరును పరిశీలించాలి..అనే ఆకాంక్ష బీసీ వర్గాలు, మహిళలు, ఆమె అభిమానులు మరియు అనుచరుల్లో వ్యక్తమవుతోంది.





