Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: YSRCP

అమరావతి

డీఎస్సీపై పోరాటం ఆగదు: వైఎస్ జగన్

డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ విచారణ కోరుతూ చేపట్టిన వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలపై జరిగిన ఘటనలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పార్టీ నాయకులతో సమావేశమైన జగన్, నిరసన కార్యక్రమాల సందర్భంగా తమ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌పై కూడా జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతున్నందుకే తమ పార్టీ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. బెదిరింపులకు వెనకడుగు వేసేది లేదని, డీఎస్సీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించే వరకు పోరాటం కొనసాగిస్తామని జగన్ స్పష్టం చేశారు. అభ్యర్థులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డీఎస్సీపై వైసీపీకి కావాల్సింది అరెస్టులే: బీద రవిచంద్ర

డీఎస్సీ నియామకాల విషయంలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై శాసన మండలి సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర స్పందించారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై ప్రభుత్వం కేసులు ఎందుకు నమోదు చేయడం లేదన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “వైసీపీ నాయకులకు కావాల్సింది అరెస్టులే. ప్రభుత్వం ప్రశ్నించినందుకు పోలీసులు ఇళ్లపైకి వచ్చారని, తమను అరెస్ట్ చేశారని చెప్పుకొని రాజకీయ సానుభూతి పొందాలని చూస్తున్నారు. అనిల్‌కుమార్ యాదవ్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తామే ముందుగా అరెస్ట్ కావాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అరెస్టుల విషయంలో కూడా వారిలో పోటీ కనిపిస్తోంది” అని విమర్శించారు. అయితే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలకు రాజకీయంగానే సమాధానం ఇస్తామన్నారు. ప్రజలకు మెరుగైన పాలన, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయడం, విద్యారంగాన్ని బలోపేతం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఆరోపణలు, అరెస్టుల రాజకీయాలకంటే ప్రజా సంక్షేమం, అభివృద్ధి, యువత భవిష్యత్తే తమకు ముఖ్యమని బీద రవిచంద్ర స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వేమిరెడ్డిపై ఆరోపణలు నిరూపించాలి: రూప్ కుమార్

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న ఆరోపణలను నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. పార్టీని, కార్యకర్తలను పట్టించుకోకుండా రాష్ట్రానికి దూరంగా ఉన్న అనిల్ ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో వార్తల్లో నిలవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే వేమిరెడ్డి సొంత నిధులతో ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. సైదాపురం క్వార్ట్జ్ మైన్ల విషయంలో వేమిరెడ్డి రూ.8 వేల నుంచి రూ.10 వేలు అడిగారన్న అనిల్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఆ ఆరోపణను ఒక్క మైన్ యజమానితో నిరూపించినా దేనికైనా సిద్ధమని రూప్ కుమార్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రూ.1,000 కోట్లతో ప్రతిపాదించిన క్వార్ట్జ్ ఫ్యాక్టరీ వ్యాపారం నుంచి వేమిరెడ్డి ఏడాది క్రితమే తప్పుకున్నారని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో అనిల్‌కు ప్రాధాన్యం లేకపోవడంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వేమిరెడ్డి స్థాయి, సేవలు ప్రజలకు తెలుసని, అనిల్ రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీబీఐ విచారణకు సవాల్

డీఎస్సీ, స్పోర్ట్స్‌ కోటా అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధమా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్‌-1 ఆరోపణలపైనా విచారణకు తాము సిద్ధమన్నారు. సుగాలి ప్రీతి ఘటన, గంజాయి కేసులు, హిట్‌ అండ్‌ రన్‌, వివేకానందరెడ్డి హత్య కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీ సోదాలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.