SRI DURGA MALLESWARA SIDDHARTHA MAHILA KALASALA, VIJAYAWADADate: 10/10/2026
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లోని ఎలక్ట్రానిక్స్ విభాగం వారు *”AI based Flexible and Conformal Electronics for future Applications”* అను అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య వ్యక్తిగా KL యూనివర్సిటీ లోని R&D విభాగమునకు డీన్ గా వ్యవహరిస్తున్న *Dr. BTP మాధవ్ గారు* విచ్చేశారు. శ్రీ మాధవ్ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో sustainable, eco-friendly electronics కు ఉన్న ప్రాముఖ్యత, Artificial Intelligence electronics రంగముపై చూపుతున్న ప్రభావము, antenna communications, radiation, RF application మొదలగు అంశాలను, విద్యార్థినులకు భవిష్యత్తులో సెన్సార్ బేస్డ్ అప్లికేషన్స్ లో ఉండే ఉద్యోగ అవకాశాల గురించి వివరముగా తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ Dr. P.V. Durgavathi మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానమును పెంచుకొనుటకు ఇటువంటి సదస్సులు ఎంతగానో ఉపయోగ పడతాయని, విద్యార్థినులు ఇటువంటి సదస్సుల వలన ఎంతో నేర్చుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో Electronics విభాగాధిపతి J.P. Kanthi, అధ్యాపక బృందం Manohari, Himaja, Yamini, Electronics విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.









