Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Telangana Assembly

హైదరాబాద్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు దారుణం: తలసాని

అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడం దారుణమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 7న అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయని, మహిళా ఎమ్మెల్యేలతోనూ అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్‌కు గౌరవం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

క్షమాపణ చెబుతారనుకున్నా: స్పీకర్

నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని భావించానని స్పీకర్ వ్యాఖ్యానించారు. హరీశ్‌రావుకు మైక్ ఇచ్చింది కూడా క్షమాపణ చెబుతారనే ఉద్దేశంతోనని తెలిపారు. అయితే అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. తాను స్పీకర్‌గా అన్ని వైపులా చూస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నానన్నారు. కడియం శ్రీహరిని ప్యానెల్ స్పీకర్‌గా పెడుతున్నట్లు చెప్పారు. గతంలో సబితా ఇంద్రారెడ్డితో రాజకీయంగా విభేదాలున్నా ఇలాంటి పరిస్థితులు రాలేదన్నారు.

తెలంగాణ

గౌరవ సభ కాదు.. కౌరవ సభ|హరీశ్‌రావు

తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికి, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలపైనే తిరిగి కేసులు పెట్టడం దారుణమన్నారు. అసెంబ్లీ “గౌరవ సభ కాదు.. కౌరవ సభ”గా మారిందని విమర్శించారు. స్పీకర్‌పై తమకు పూర్తి గౌరవం ఉందని పేర్కొంటూ, దళితులపై ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.