Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Ramesh Naidu

తూర్పు గోదావరి

మోదీ 25 ఏళ్ల ప్రజా సేవ స్ఫూర్తిదాయకం

రాజమహేంద్రవరం, అక్టోబరు 7 (పున్నమి ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని చెరుకూరి గార్డెన్స్‌లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లమిల్లి మాట్లాడుతూ మోదీ సుదీర్ఘ ప్రజా జీవితం, సేవా దృక్పథం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు మోదీ చేస్తున్న కృషికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువత దేశాభివృద్ధిలో చురుకైన భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ సందర్భంగా నాయకులు మోదీ సేవలను కొనియాడారు.

తూర్పు గోదావరి

శ్రీమతి దనాని విజయలక్ష్మి జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో అన్నదానం

బిక్కవోలు, అక్టోబరు 7 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి బిక్కవోలు శాఖ ఆధ్వర్యంలో బిక్కవోలు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త చోడవరపు రాంబాబు, శ్రీమతి సత్యవతి దంపతులు తమ కుటుంబ సభ్యురాలు కీ.శే. శ్రీమతి దనాని విజయలక్ష్మి జ్ఞాపకార్థం మల్లంపూడిలోని సాయిబాబా వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విజయలక్ష్మి భర్త దనాని వీర్రాజు, కుమార్తె శ్రీమతి సత్యవతి, అల్లుడు చోడవరపు రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆశ్రమంలోని సుమారు 50 మంది వృద్ధులకు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా అవసరమైన వారికి అండగా నిలవడమే తమ సంస్థ లక్ష్యమని సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. విజయలక్ష్మి జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహించడం ద్వారా ఆమె జ్ఞాపకాలను చిరస్మరణీయంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చోడవరపు రాంబాబు, శ్రీమతి సత్యవతి, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి బిక్కవోలు శాఖ అధ్యక్షులు సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు, శ్రీమతి మణికుమారి, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.  

తూర్పు గోదావరి

సేవా సంకల్ప్ అభియాన్‌లో విద్యార్థులకు బహుమతులు

అనపర్తి, అక్టోబరు 6 (పున్నమి ప్రతినిధి): సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అనపర్తి శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహుమతులు అందజేశారు. బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కర్రి శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో ఈ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమిల్లి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెలరోజులపాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రకృతి, నీరు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. దేశ అభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

కొమరిపాలెంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం

బిక్కవోలు, అక్టోబరు 6 (పున్నమి ప్రతినిధి): పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో రూ.32.50 లక్షల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం ద్వారా స్థానికులకు ప్రయోజనం కలగనుంది. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, బిక్కవోలు మండల కూటమి నాయకులు, కొమరిపాలెం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

విలేజ్ హెల్త్ క్లినిక్స్ ద్వారా గ్రామీణులకు మెరుగైన వైద్యం

రాజమహేంద్రవరం, అక్టోబరు 6 (పున్నమి ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంతోపాటు ఆరోగ్యం, పోషకాహారం, పారిశుధ్యం, జీవనశైలిపై అవగాహన కల్పించడమే విలేజ్ హెల్త్ క్లినిక్స్ లక్ష్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 267 క్లినిక్స్ ప్రారంభించామని, వచ్చే ఐదేళ్లలో 10 వేల క్లినిక్స్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనపర్తిలో రూ.80 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మించినట్లు తెలిపారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, అనపర్తిలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ కోమలి, జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

వర్షాలు సమృద్ధిగా కురవాలని బిక్కవోలులో వరుణయాగం

బిక్కవోలు, అక్టోబరు 6 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో మంగళవారం వరుణయాగం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో చేపట్టిన వరుణయాగంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డితో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వరుణదేవుడి కరుణ కోసం వరుణయాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఎల్‌నినో ప్రభావం తగ్గి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిందన్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా ఎదుర్కొని ప్రజల సంక్షేమానికి సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఎల్‌నినో ప్రభావం నుంచి ప్రజలు బయటపడాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

తూర్పు గోదావరి

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

రాజమహేంద్రవరం రూరల్, అక్టోబరు 5 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఎన్జీవో బిక్కవోలు మండల శాఖ ఆధ్వర్యంలో బిక్కవోలు గ్రామానికి చెందిన చోడవరపు కుటుంబ సభ్యులు మానవీయ సేవా కార్యక్రమం నిర్వహించారు. దివంగత చోడవరపు కూటయ్య, శ్రీమతి అమ్మాజీ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు, కోడళ్లు చోడవరపు రాంబాబు–సత్యవతి దంపతులు, చోడవరపు లోవరాజు–కుమారి దంపతులు సోమవారం రాజమండ్రి రూరల్ నామవరంలోని మానవీయ ఐక్య సేవా అసోసియేషన్ ఆశ్రమంలో 60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు, చైర్మన్ టి. శ్రీనివాసరావు, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు, బిక్కవోలు మండల శాఖ అధ్యక్షులు సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు, శ్రీమతి మణికుమారి, అయితిరెడ్డి అయ్యప్ప, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం చేసిన చోడవరపు కుటుంబ సభ్యులకు ఆశ్రమ నిర్వాహకులు, దివ్యాంగులు, వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు. తమ పట్ల ఆప్యాయతతో అన్నదానం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దివంగతుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

తూర్పు గోదావరి

అనపర్తికి జలజీవన్ మిషన్ కింద రూ.75.60 కోట్లు

బిక్కవోలు, అక్టోబరు 5 (పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ కింద ఇప్పటివరకు రూ.75.60 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బిక్కవోలులో జలజీవన్ మిషన్ పనులకు ఎమ్మెల్యే నల్లమిల్లి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, కూటమి నాయకులు శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే 33 పనులకు రూ.58.25 కోట్లు ఖర్చవుతుండగా, తాజాగా మరో 25 పనులకు రూ.17.35 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ నిధులను సద్వినియోగం చేయకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు. రంగంపేట మండలానికి తాగునీటి కోసం త్వరలో జలజీవన్ మిషన్ కింద నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మండలానికి సంబంధించి రూ.42 కోట్ల ప్రతిపాదనలు పంపించామని, గ్రిడ్ ద్వారా కూడా తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

వైసీపీ నేతలకు సుబ్బారెడ్డి సవాల్‌

చెరువులు, కాలువలపై ముఖాముఖి చర్చకు సిద్ధమని వెల్లడి బలభద్రపురం, అక్టోబరు 3 (పున్నమి ప్రతినిధి): బలభద్రపురం గ్రామంలోని చెరువులు, కాలువలు, ముంపు సమస్యపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు టీడీపీ నాయకుడు సుబ్బారెడ్డి స్పందించారు. సంత మార్కెట్‌ వద్ద ఉన్న ఊరచెరువును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపవరం వెదుళ్ల చెరువు నుంచి మిగులు నీరు కలింగల ద్వారా ఊరచెరువులోకి చేరి, అక్కడి తూము, సుమారు 12 అడుగుల బోధి ద్వారా దిగువ ప్రాంతాలకు వెళ్లే సహజ నీటి ప్రవాహ వ్యవస్థ గతంలో ఉండేదని తెలిపారు. వాకింగ్‌ ట్రాక్‌ పేరుతో చెరువు చుట్టూ నిర్మాణాలు చేపట్టి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో మార్గాలకు తగిన తూములు ఏర్పాటు చేయకపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని ఆరోపించారు. 2013 నీలం తుఫాను సమయంలో బలభద్రపురం గ్రామంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని, 2014లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు రూ.30 లక్షలతో కాలువ పనులు చేపట్టి నీటిని గోదావరి కాలువలోకి మళ్లించే ఏర్పాట్లు చేసినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. గీతా మందిరం వెనుక ఉన్న 12 అడుగుల బోధి, కాలువలు, పుంతల పరిస్థితిపై రికార్డులతో సహా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మాజీ సర్పంచ్‌ కర్రి సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ వీరరాఘవరెడ్డితో పాటు వైసీపీ నాయకులు ముఖాముఖి చర్చకు రావాలని సవాల్‌ చేశారు. మత్స్యకార కుటుంబాలు నిర్మించిన బండకు సంబంధించి తాము ఎలాంటి బిల్లులు తీసుకోలేదని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి.. తాము బిల్లులు తీసుకున్నట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు. అదే విధంగా ప్రభుత్వం ఇచ్చిన పట్టాల పరిమితిని మించి నిర్మాణాలు చేపట్టలేదని వైసీపీ నాయకులు నిరూపించాలని కోరారు. చెరువులు, కాలువలపై రాజకీయ ఆరోపణలకు బదులుగా రికార్డుల ఆధారంగా వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన అన్నారు.

తూర్పు గోదావరి

వైసీపీ నేతలకు సుబ్బారెడ్డి సవాల్‌

బలభద్రపురం, అక్టోబరు 3 (పున్నమి ప్రతినిధి): గ్రామంలోని చెరువులు, కాలువలు, ముంపు సమస్యపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలకు సుబ్బారెడ్డి స్పందించారు. వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణంతో ఊరచెరువుకు నీటి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో మార్గాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. 2014లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు రూ.30 లక్షలతో ముంపు నివారణ కాలువ పనులు చేపట్టినట్లు తెలిపారు. 12 అడుగుల బోధి, కాలువలపై రికార్డులతో ముఖాముఖి చర్చకు సిద్ధమన్నారు. బండ నిర్మాణానికి తాము బిల్లులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ నేతలకు సవాల్‌ విసిరారు.