Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Prathap

తిరుపతి

NH16 హైవేపై అడ్డంగా నేల కోరిగిన చెట్టు.. రాకపోకలకు తీవ్ర అంతరాయం

దొరవారి సత్రం సమీపం లో NH 16 హైవే పై భారీ చెట్టు ఒక్కసారిగా నేలకొరిగి రహదారికి అడ్డంగా పడింది. దీంతో హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై చెట్టు కొమ్మలు, ఆకులు విస్తరించి ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో చెట్టు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు రహదారికి అడ్డంగా పడటంతో వాహనాలు నెమ్మదిగా, అప్రమత్తంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైవేపై రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిపై పడిన చెట్టును, కొమ్మలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. చెట్టును తొలగించి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

తిరుపతి

*దొరవారిసత్రం మండలం పాలింపాడులో విషాదం – కరెంటు స్తంభంపై వ్యక్తి మృతి.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమా?*

*పాలింపాడు (దొరవారిసత్రం మండలం):* దొరవారిసత్రం మండలం పాలింపాడు గ్రామంలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరెంటు స్తంభంపై పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్తంభంపై తలక్రిందులుగా వేలాడుతున్న మృతదేహాన్ని చూసి గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. *అసలేం జరిగింది?* మృతుడు విద్యుత్ పనుల నిమిత్తం స్తంభం ఎక్కగా, అప్పటికే లైన్ లో కరెంటు ఉండటంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సరైన భద్రతా పరికరాలు లేకపోవడం, లైన్ మెన్ నిర్లక్ష్యంగా కరెంటు సప్లై ఆపకుండా పని చేయించడమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.